Naga Shaurya: యువ హీరో స్క్రిప్ట్ సెలక్షన్ ను తప్పు పడుతున్న ఫ్యాన్స్..

Naga Shaurya: యువ హీరో స్క్రిప్ట్ సెలక్షన్ ను తప్పు పడుతున్న ఫ్యాన్స్

Dhatripriya
Published on: 20 March 2023 7:01 PM IST
Fans Saying That Naga Shaurya Should Change
X

Naga Shaurya: ఇప్పటికైనా నాగశౌర్య మారాలి అంటున్న ఫ్యాన్స్ 

Naga Shaurya: ఈ మధ్యకాలంలో చాలా మంది యువ హీరోలకి టైం ఏ మాత్రం బాగోవటం లేదు. చేతినిండా సినిమాలు ఉంటున్నాయి కానీ అందులో ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోతున్నాయి. ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి కానీ అందులో ఒకటి కూడా కెరియర్ కి ఉపయోగపడటం లేదు. కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్ వంటి యువ హీరోలు కూడా ఈ మధ్య ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న మరొక పేరు నాగశౌర్య.

ఈ మధ్యకాలంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. ఈ మధ్యనే తన ఆశలన్నీ "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" సినిమా పైన పెట్టుకొని సినిమాని విడుదల చేశాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నాగశౌర్య కి కావాల్సిన హిట్ ని ఇవ్వలేకపోయింది. అమ్మమ్మగారిల్లు, కణం, నర్తనశాల, అశ్వద్ధామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వ్రిందా విహారి వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్లు అందుకున్నాడు నాగశౌర్య.

ఇన్ని ఫ్లాప్ సినిమాల తర్వాత అయినా నాగశౌర్య ఒకసారి తన స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలానే ఉంది. ఒకవేళ తన స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎలాంటి మార్పులు చేయకుండా అలాంటి సినిమాలు మాత్రమే చేస్తూ వస్తే వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్ లాంటి హీరోల లాగా ఫ్లాప్ హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా నాగశౌర్య స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తన వైఖరి మారుస్తాడో లేదో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story