ఆకాశానికి చేరిన సోనూ సూద్ క్రేజ్ : హైదరాబాద్‌‌లో ఆయనను కలిసేందుకు భారీగా వెళ్లిన ఫ్యాన్స్

ఆకాశానికి చేరిన సోనూ సూద్ క్రేజ్ : హైదరాబాద్‌‌లో ఆయనను కలిసేందుకు భారీగా వెళ్లిన ఫ్యాన్స్
x
Highlights

లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం నుంచి.. ఎంతో మందికి సాయం చేయడం వరకు ఇలా మంచితనానికి కేరాఫ్‌గా మారిన సోనూసూద్.. రియల్...

లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం నుంచి.. ఎంతో మందికి సాయం చేయడం వరకు ఇలా మంచితనానికి కేరాఫ్‌గా మారిన సోనూసూద్.. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఒక్కసారిగా సోనూ క్రేజ్ పెరిగిపోయింది. అతను ఎక్కడ కనిపించినా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు.

చిరు హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్య సినిమా సెట్‌లో ఉన్న సోనూసూద్‌ను కలిసేందుకు అభిమానులు భారీగా తరలివెళ్లారు. వాహనం‌ నుంచి బయటికి వచ్చిన సోనూను పలకరించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సోనూ సూద్ బయటికి వచ్చి అక్కడ ఉన్న అభిమానులను..తనపై చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అంతేకాదు హైదరాబాద్ లవ్ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు కూడా. ఎవరేం అనుకున్నా కూడా ఇప్పుడు ఈయనకు మాత్రం హీరోలను మించిన అభిమానం అయితే ఉంది. ఆచార్యతో పాటు అల్లుడు అదుర్స్ లో కూడా నటిస్తున్నాడు సోనూ సూద్. ఈ రెండు సెట్స్ లో కూడా సోనూకు రాగానే సత్కారం చేసారు దర్శక నిర్మాతలు.


Show Full Article
Print Article
Next Story
More Stories