నా బిటెక్ పూర్తయిన "ఆర్ఆర్ఆర్" మాత్రం రిలీజ్ కాలేదంటూ అభిమాని సెటైర్

* అభిమాని కామెంట్ కి "ఆర్ఆర్ఆర్" మూవీ టీం కౌంటర్

Sandeep Reddy
Updated on: 19 Nov 2021 5:53 PM IST
Fan Satire on RRR Movie Team About the Delay of Movie Release in Social Media
X

"ఆర్ఆర్ఆర్" పోస్టర్

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ "ఆర్ఆర్ఆర్" చిత్రంపై సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని సెటైర్ వేశాడు. 2017 లో షూటింగ్ మొదలుపెట్టిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ఇప్పటికి విడుదల కాలేదని.., తాను డిప్లొమాలో చేరినప్పుడు షూటింగ్ మొదలైందని ప్రస్తుతం తన ఇంజనీరింగ్ పూర్తయిన కూడా సినిమా మాత్రం విడుదలకి నోచుకోలేదని సోషల్ మీడియాలో చేసిన కామెంట్ కి "ఆర్ఆర్ఆర్" టీం కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

"మరి ఏమి చేయమంటారు కరోనా వల్ల మీరు కాలేజీకి వెళ్ళనన్ని రోజులు మేము షూటింగ్ కూడా చేయలేదు" అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న "ఆర్ఆర్ఆర్" టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదలైన "నాటు.. నాటు" సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్ అయింది. ఇక ఎమ్ ఎమ్ కీరవాణి తన సంగీతాన్ని అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న 2022 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story