Fan Accuses Amitabh : బిగ్ బీ.. మీ మీద గౌరవం పోయింది.. మహిళ ట్వీట్!

Fan Accuses Amitabh : బిగ్ బీ.. మీ మీద గౌరవం పోయింది.. మహిళ  ట్వీట్!
x
amitabh Bachchan(File Photo)
Highlights

Fan Accuses Amitabh : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్

Fan Accuses Amitabh : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కోరోనా బారిన పడ్డారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ కూడా గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్నీ అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకొని ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు బిగ్ బీ.. అయితే దీనిపైన జాన్వీ మఖీజా అనే మహిళ అమితాబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన‌వ‌స‌రంగా నానావ‌తి ఆసుప‌త్రికి ప‌బ్లిసిటీ చేస్తున్నారని అన్నారు. నేటి నుండి మీపై గౌరవం పోయింద‌ని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. జాన్వీ మ‌ఖీజా త‌న తండ్రిని నానావ‌తికి ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ తప్పుడు రిపోర్ట్ లతో ఆసుపత్రిలో జాయిన్ చేశారట.. ఆ తర్వాత ఆయ‌న‌కి యాంటీ బాడీస్ టెస్ట్ చేయించాం. క‌రోనా సోక‌లేద‌ని తేలింది. అయితే డబ్బుల కోసం నానావతి ఆసుపత్రి సిబ్బంది నాటకాలు ఆడారని, అలాంటి ఆసుపత్రిని, మీరు కూడా ఈ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తుండడం నాకు చాలా బాధ కలిగిస్తోందని, దీనితో మీపై ఉన్న గౌరవం పూర్తిగా పోయిందని ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంది.

అయితే దీనిపైన అమితాబ్ తన బ్లాగ్ లో స్పందించారు. తానూ ఎవ‌రికి ప‌బ్లిసిటీ చేయ‌లేదని, నానావతి నుండి నాకు లభించిన సంరక్షణ మరియు చికిత్సకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని అన్నారు. అంతేకాకుండా మీరు నా ప‌ట్ల గౌర‌వాన్ని కోల్పోయి ఉండ‌వ‌చ్చు. కాని వైద్యుల ప‌ట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అంటూ బిగ్ బీ రాసుకొచ్చారు. ఇక మీ తండ్రికి జ‌రిగిన దానికి నేను చింతిస్తున్నాను అని అమితాబ్ అందులో పేర్కొన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories