బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న హాస్యబ్రహ్మ

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కు సంక్రాంతి పండుగ రోజున బైపాస్ ఆపరేషన్ జరగడం ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది. ఆయన ఆదివారంనాడు ఆయన అనారోగ్యం పాలయ్యారు.

Ruthvik
Updated on: 16 Jan 2019 3:27 PM IST
బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న హాస్యబ్రహ్మ
X

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కు సంక్రాంతి పండుగ రోజున బైపాస్ ఆపరేషన్ జరగడం ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది. ఆయన ఆదివారంనాడు ఆయన అనారోగ్యం పాలయ్యారు. గాలి తీసుకోవడం కష్టంగా అనిపించడంతో ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. నిన్న ఉదయం అదే హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. ప్రస్తుతం 62 ఏళ్ల బ్రహ్మానందం కోలుకుంటున్నారని సమాచారం. డాక్టర్ల అబ్జర్వేషన్ కోసం ఆయన ఒక వారం రోజులు పాటు హాస్పటిల్ లో ఉండనున్నారు.

ఆయన కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ హాస్పిటల్ లోనే ఉండి ఆయనను చూసుకుంటున్నారని సమాచారం. కమెడియన్ గా ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ ను ఏలిన బ్రహ్మానందం కు ఈ మధ్య సినిమా ఆఫర్లు తగ్గాయని చెప్పుకోవాలి. గత ఏడాది 'ది గ్రేట్ లాఫ్టర్ చాలెంజ్' అనే టీవీ షో తో హోస్ట్ గా మారి ప్రేక్షకులకు మరింత దగ్గరైన బ్రహ్మానందం ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో రేలంగి పాత్రలో కనిపించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులే కాక లక్షలాది ఫాన్స్ కూడా ఏదురుచూస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story