కుటుంబ జీవితాన్ని మించింది లేదు.. యాంకర్ అనసూయ

K V D Varma
Published on: 22 July 2019 1:13 PM IST
కుటుంబ జీవితాన్ని మించింది లేదు.. యాంకర్ అనసూయ
X

కుటుంబాన్ని మించిన సంతోషం ప్రపంచంలో ఏదీ లేదంటోంది జబర్దస్త్ అనసూయ. తొందరగా పెళ్లి చేసుకున్నావ్ అనసూయా లేకుంటే టాప్ హీరోయిన్ అయ్యేదానివి అని చాలా మంది తనతో అంటుంటారని చెబుతూ తనకు కుటుంబాన్ని మించి ఏదీ సంతోషాన్ని ఇవ్వదని ట్విట్టర్ లో చెప్పింది అనసూయ. తన కుటుంబంతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విధంగా చెప్పింది. తాను సాధించిన వాటిలో అన్నింటి కంటే గొప్పది తన కుటుంబమని పేర్కొంది. తాను జీవితంలో పొందిన వాటికి సిగ్గుపడడం లేదని, గర్వపడుతున్నానని చెప్పింది. పని ప్రదేశంలో మగవాళ్లకు లేని హద్దులు ఆడవాళ్లకే ఎందుకని అనసూయ ప్రశ్నించింది. పని ప్రదేశంలో తనలాగే ఆలోచించే వారితో కలిసి పనిచేసేందుకు తనకెప్పుడూ ఇబ్బంది ఉండదని చెప్పింది. ఈ ట్వీట్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

K V D Varma

K V D Varma

Next Story