టిక్కెట్లు కొనద్దు అంటున్న నిఖిల్

టిక్కెట్లు కొనద్దు అంటున్న నిఖిల్
x
Highlights

ఇప్పటిదాకా సినిమా విడుదల కాకముందే ఆ సినిమా వీడియోను ఇంటర్నెట్లో లీక్ చేయడం మనం చూశాం. కానీ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకముందే ఫలానా తేదీకి టికెట్లు బుక్ చేసుకునే వినియోగం కల్పించి ప్రేక్షకులను కొంత మంది మోసం చేస్తున్నారు.

ఇప్పటిదాకా సినిమా విడుదల కాకముందే ఆ సినిమా వీడియోను ఇంటర్నెట్లో లీక్ చేయడం మనం చూశాం. కానీ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకముందే ఫలానా తేదీకి టికెట్లు బుక్ చేసుకునే వినియోగం కల్పించి ప్రేక్షకులను కొంత మంది మోసం చేస్తున్నారు. 'ముద్ర' సినిమా కూడా అలాంటి వారి చేతిలో పడింది. తమిళ బ్లాక్ బస్టర్ సినిమా 'కనితన్' రీమేక్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ముద్ర అనే సినిమాలో నిఖిల్, లావణ్య త్రిపాటి హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఒక ప్రముఖ సినిమా టికెట్ బుకింగ్ సినిమా టికెట్లను ఆన్లైన్లో పెట్టటం అందరినీ షాక్ కి గురి చేసింది.

నిజంగా సినిమా జనవరి 25న విడుదలవుతుంది అనుకుని చాలా మంది ఫ్యాన్స్ టిక్కెట్లు కొనడం మొదలు పెట్టారు. కానీ విడుదల తేదీ మీద అవగాహన ఉన్న కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఇందులో ఏదో మతలబు ఉందని ఉందని నిర్మాణ సంస్థ ప్రమేయం లేకుండా ఎవరో ఏదో దురుద్దేశంతో ఇది చేశారని గుర్తించి నిఖిల్ కు వివరాలను పంపారు. దీంతో రంగంలోకి దిగిన నిఖిల్, నిర్మాతల టీం సదరు యాప్ తో పాటు థియేటర్ల మీద చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇస్తూ తన 'ముద్ర' సినిమా ఆ రోజు విడుదల అవ్వట్లేదని చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories