logo

సక్సెస్ మీట్ కి డేట్ ఫిక్స్

వరుస డిజాస్టర్ లతో సతమతమైన దిల్ రాజు కు ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లో ఒక హిట్ దొరికింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

F2F2

వరుస డిజాస్టర్ లతో సతమతమైన దిల్ రాజు కు ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లో ఒక హిట్ దొరికింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మూడు సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ సందడి చేస్తోంది ఈ సినిమా. దిల్ రాజు మాత్రమే కాక ఈ చిత్ర బృందం కూడా సినిమా సక్సెస్ తో సంతోషంతో తేలిపోతోంది అని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఒక సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు సినిమా దర్శక నిర్మాతలు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈనెల 18వ తేదీన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా సక్సెస్ మీట్ జరగనుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నటులు అందరూ ఈ సక్సెస్ ఈవెంట్ కు విచ్చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ నటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైంది.

లైవ్ టీవి

Share it
Top