అవలీలగా 70 కోట్ల మార్కు దాటిన 'ఎఫ్ 2'

అవలీలగా 70 కోట్ల మార్కు దాటిన ఎఫ్ 2
x
Highlights

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఎఫ్ 2'. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకుల...

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఎఫ్ 2'. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. 15 రోజుల్లో 68.83 కోట్లు సాధించిన ఈ సినిమా 16 వ రోజున 70 కోట్ల షేర్ ను అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 71.77 కోట్ల పేరును నమోదు చేసుకుంది.

తెలుగులో భారీ కలెక్షన్లను సాధించిన తెలుగు సినిమాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. చూస్తూ ఉంటే ఈ సినిమా అవలీలగా టాప్ 10 లిస్టు లో కూడా చేరిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు దిల్ రాజు నిర్మించిన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా 'ఎఫ్ 2' నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల 'F2' కలెక్షన్స్

నైజామ్: 20.45 cr

సీడెడ్: 7.57 cr

ఉత్తరాంధ్ర: 8.93 cr

కృష్ణ: 4.67 cr

గుంటూరు: 5.12 cr

ఈస్ట్ : 6.24 cr

వెస్ట్: 3.67 cr

నెల్లూరు: 1.70 cr

ఎపీ + తెలంగాణా టోటల్:58.35 cr

మిగతా ప్రాంతాల్లో: 4.62 cr

ఓవర్సీస్: 8.80 cr

ప్రపంచవ్యాప్తంగా టోటల్: 71.77 cr

Show Full Article
Print Article
Next Story
More Stories