ఓవర్సీస్‌లో దుమ్ములేపుతున్న 'ఎఫ్2'

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా హాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో...
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా హాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'. తమన్నా మరియు మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా జనవరి 12వ తారీకున విడుదలైంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ సినిమా. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఈ మధ్యన మరొక రికార్డు సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు ఓవర్సీస్ లో సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది 'ఎఫ్ 2'. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. ఇప్పటికే విడుదలై రెండు వారాలు గడిచినప్పటికీ థియేటర్ల వద్ద ఈ సినిమా హంగామా ఇంకా కనిపిస్తూనే ఉండడం విశేషం. చాలాకాలం తరువాత మళ్ళీ కామెడీ పాత్రలో కనిపించి విక్టరీ వెంకటేష్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచారు. మొట్టమొదటిసారిగా వరుణ్ తేజ్ కూడా కామెడీ పాత్రలో ఈ సినిమాతో బాగానే మెప్పించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినీమాకు సంగీతాన్ని అందించారు.
$2 Million in USA 💥⚡️
— Sri Venkateswara Creations (@SVC_official) January 27, 2019
BOMMA BLOCKBUSTER!!
Anthegaa... Anthegaaa.... 🤗🤗#F2 #FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP
Directed by @AnilRavipudi pic.twitter.com/hKbDR5HlH3
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT