logo

పెట్టుబడికి రెండింతలు వసూలు చేసిన మల్టీ స్టారర్ సినిమా

పెట్టుబడికి రెండింతలు వసూలు చేసిన మల్టీ స్టారర్ సినిమా

సంక్రాంతి విడుదలలో ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలయిన రెండు వారాలకే థియేటర్ లో నుండి బయటకు వచ్చేస్తున్న సినిమాలు ఉండగా మరోవైపు నాలుగు వారాలయినప్పటికీ భారీ వసూళ్ళలో అందరినీ షాక్ కి గురి చేస్తుంది ఈ సినిమా.

25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 77.87 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రోసర్స్ లిస్టులో 8వ స్థానంలో నిలిచింది. థియేట్రికల్ రైట్స్ కేవలం 34.50 కోట్ల కు మాత్రమే అమ్ముడయ్యాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల పంట పండింది. పెట్టుబడికి రెండింతల వసూళ్లు రాబట్టి 'ఎఫ్ 2' సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ప్రొఫైట్లు తెచ్చి పెట్టింది. టాప్ టెన్ హైయెస్ట్ గ్రాసర్ లిస్టులో 'శ్రీమంతుడు' సినిమా 84 కోట్లతో ఏడవ స్థానంలో ఉంది. మరి 'ఎఫ్ 2' సినిమా ఫుల్ రన్లో 'శ్రీమంతుడు'ని దాటుతుందో లేదో వేచి చూడాలి.

'F2' ఇరవై ఐదు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్:

నైజామ్: 22.22 కోట్లు

సీడెడ్: 8.38 కోట్లు

ఉత్తరాంధ్ర: 9.90 కోట్లు

కృష్ణ: 5.02 కోట్లు

గుంటూరు: 5.41 కోట్లు

ఈస్ట్ : 6.56 కోట్లు

వెస్ట్: 3.99 కోట్లు

నెల్లూరు: 1.87 కోట్లు

ఎపీ + తెలంగాణ: రూ. 63.35 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.37 కోట్లు

ఓవర్సీస్: 9.15 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: రూ. 77.87 కోట్లు.

లైవ్ టీవి

Share it
Top