బిగ్ బాస్ నుంచి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనేనా?

బిగ్ బాస్ నుంచి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనేనా?
x
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షో.. నాలుగున్నర కోట్ల మంది ప్రేక్షకుల్ని అలరించిన షో. రెండు వారాలుగా తెలుగు టెలివిజన్ ప్రసారాల్లో టాప్ రేటింగ్ సాధిస్తూ...

బిగ్ బాస్ రియాల్టీ షో.. నాలుగున్నర కోట్ల మంది ప్రేక్షకుల్ని అలరించిన షో. రెండు వారాలుగా తెలుగు టెలివిజన్ ప్రసారాల్లో టాప్ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. మొత్తం 15 మంది బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్నారు. మొదటి వారం కూడా అన్తేమంది ఉన్నా.. రెండో వారంలో ఊక వ్యక్తి మారారు. హేమ మొదటి వారంలోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆమె స్థానంలో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రెండో వారం చాలా ఆసక్తి కరంగా బిగ్ బాస్ షో నడిచింది.

ఈరోజు ఒకరు షో నుంచి బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది. దానికోసం మొత్తం 8 మంది సభ్యులను నామినేట్ చేశారు. వారిలో నలుగురు సేఫ్ జోన్ లో ఉన్నట్టు శనివారం నాగార్జున ప్రకటించారు. ఇక నామినేన్స్ లో మిగిలింది వరుణ్, వితిక షేరు, పునర్నవి, జాఫర్ మాత్రమే. ఈరోజు వీరిలో ఒకరు బయటకు వెళతారు. ఇప్పుడు అది ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. నలుగురిలో కచ్చితంగా సేఫ్ జోన్లో ఉండేది మాత్రం పునర్నవి. అది అందరికీ అర్థం అవుతోంది. అయితే, భార్యా భర్తలు కొంత కాలం కొనసాగుతారా? లేకపోతే ఒకర్ని ఈ వారం పంపిస్తారా అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా వారిద్దరిపై హౌస్ మేట్స్ లో వ్యతిరేకత కనిపించింది. మరి అదే వ్యతిరేకత ఓటింగ్ లో వస్తుందా రాదా అనేది చూడాలి. ఎందుకంటే.. వారిద్దరి మధ్య రోమాన్స్ చూడాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందువల్ల ఓటింగ్ కూడా వీరికి బాగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

ఇక మిగిలింది.. జాఫర్. జర్నలిస్ట్ అయిన జాఫర్ హౌస్లో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అడపా దడపా కొన్ని చర్చల్లో పాల్తోంటున్నా.. బాబా భాస్కర్తో తప్ప వేరే వారేవరితోనూ పెద్దగా కలవడం లేదు. ఈ నేపధ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం జాఫర్ కే ఉంది. హౌస్ మేట్స్ మాత్రం జాఫర్ హౌస్ లో ఉండాలని కోరుకున్నారు. కానీ, శ్రీముఖికి ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పి ఆమెను సేఫ్ లో పెట్టారు నాగార్జున. అందువల్ల ఓటింగ్ ప్రాతిపాదికలో కచ్చితంగా జాఫర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వెళ్లిపోతారనేది టాక్. కొద్ది గంటల్లో ఈ సస్పెన్స్ వీడిపోనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories