మెగా హీరో సినిమాలో తెలుగమ్మాయి

మెగా హీరో సినిమాలో తెలుగమ్మాయి
x
Highlights

సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహ విలన్ గా తెరకెక్కిన గ్యాంగ్స్టర్ కామెడీ సినిమా 'జిగర్తాండ' తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్...

సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహ విలన్ గా తెరకెక్కిన గ్యాంగ్స్టర్ కామెడీ సినిమా 'జిగర్తాండ' తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో బాబి సింహ పోషించిన పాత్రలో ఇప్పుడు తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేశారు. తెలుగులో ఈ సినిమా 'వాల్మీకి' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈషా రెబ్బ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం హరీష్ శంకర్ ఈషా ను సంప్రదించారని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక తమిళంలో ఈ సినిమాలో సిద్ధార్ధ్ సరసన లక్ష్మీమీనన్ నటించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో సిద్ధార్థ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories