జాక్వెలిన్‌కు షాకిచ్చిన ఈడీ.. రూ.7.27 కోట్ల ఆస్తుల అటాచ్..

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాకిచ్చింది.

Arun Chilukuri
Updated on: 30 April 2022 6:01 PM IST
ED Seized Jacqueline Fernandez Assets
X

జాక్వెలిన్‌కు షాకిచ్చిన ఈడీ.. రూ.7.27 కోట్ల ఆస్తుల అటాచ్..

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాకిచ్చింది. ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ దోపిడీ కేసులో భాగంగా జాక్వెలిన్‌కు చెందిన 7.27 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన వాటిలో 7 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లేనని సమాచారం. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులను అందుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఖరీదైన వజ్రాల చెవిపోగులు, బ్రాస్ లెట్లు, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్ లు తదితర కానుకలను జాక్వెలిన్, ఆమె కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ ఇచ్చినట్టు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తేల్చారు. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story