Apology To Vijay Devarakonda : విజయ్ కి సారీ చెప్పిన నిర్మాణ సంస్థ!

Apology To Vijay Devarakonda : ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకి ఆడిషన్స్‌ అంటూ కొందరు చీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య గీతా ఆర్ట్స్,

Krishna
Published on: 18 Sept 2020 10:57 AM IST
Apology To Vijay Devarakonda :  విజయ్ కి సారీ చెప్పిన నిర్మాణ సంస్థ!
X

vijay devarakonda

Apology To Vijay Devarakonda : ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకి ఆడిషన్స్‌ అంటూ కొందరు చీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థల నుంచి ఆడిషన్స్ అంటూ ప్రకటనలు చేసి నటులను తప్పుదారి పట్టించారు. అందులో భాగంగానే తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో కొందరు మోసపూరితంగా ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు అని తెలియడంతో విజయ్ టీం అలెర్ట్ అయింది. ''విజయ్‌ తన సినిమా అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తారు. సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారు. సదరు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటాం'' అని ఇటీవల విజయ్‌ టీమ్‌ ప్రకటన విడుదల చేసింది.

అయితే తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్న తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విజయ్ దేవరకొండకి క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాహకం వలన ఇదంతా జరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా వారిపైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు చెప్పి కొందరు వ్యక్తులు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లను సంప్రదించారు. మీరు కూడా ఒప్పుకోవాలని సదరు కథానాయికలపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపట్ల విజయ్ టీంని సంప్రదించగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చింది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భాన్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని చార్మీ నిర్మిస్తున్నారు.



Krishna

Krishna

Next Story