Fake Auditions : విజయ్‌ పేరిట తప్పుడు ఆడిషన్స్‌

Fake Auditions : ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకి ఆడిషన్స్‌ అంటూ కొందరు చీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య గీతా ఆర్ట్స్, హారిక హాసిని

Krishna
Published on: 14 Sept 2020 10:37 AM IST
Fake Auditions : విజయ్‌ పేరిట తప్పుడు ఆడిషన్స్‌
X

 Vijay Devarakonda 

Fake Auditions : ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకి ఆడిషన్స్‌ అంటూ కొందరు చీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థల నుంచి ఆడిషన్స్ అంటూ ప్రకటనలు చేసి తప్పుదారి పట్టించారు. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో కొందరు మోసపూరితంగా ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు అని తెలియడంతో విజయ్ టీం అలెర్ట్ అయింది. ఈ సందర్భంగా వారు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆలాంటి వారిపై తప్పకుండా చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

"విజయ్‌ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రకటనలు ఇస్తూ నటీనటులకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. విజయ్‌ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్‌ గురించి అయినా అధికారిక సమాచారాన్ని ఆయా సినిమాల నిర్మాతలు లేదా విజయ్‌ దేవరకొండ మాత్రమే వెల్లడిస్తారు. విజయ్‌ తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటారు. విజయ్‌ దేవరకొండ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వారిపై మేము చర్యలకు సిద్ధమవుతున్నాం. ఇలాంటి తప్పుడు చర్యల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సమాచారంలో ప్రామాణికత గురించి జాగ్రత్తగా తరచిచూసుకోవాలని కోరుతున్నాం" అని వెల్లడించింది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భాన్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Krishna

Krishna

Next Story