దృశ్యం దర్శకుడు నిషికాంత్‌ కన్నుమూత

Drishyam director nishikant kamat passes away: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ కన్నుమూశారు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2020 6:22 PM IST
దృశ్యం దర్శకుడు నిషికాంత్‌ కన్నుమూత
X

Drishyam director nishikant kamat passes away: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ జూలై 31వ తేదీన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. నిషికాంత్ కామత్ సాయంత్రం 4.24 నిమిషాలకు మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు.

నిషికాంత్ కామత్ అజయ్ దేవ్ గన్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఆయన అంతకు ముందు మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిషికాంత్ కామత్.. కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించాడు. నిషికాంత్ 2005 లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మరాఠీ సినిమాలో ఆ సంవత్సరం అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఇక నిషికాంత్ కామత్ 2015 లో విడుదలైన అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన దృశ్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story