Drishyam 2: 'దృశ్యం2' ట్రైలర్‌ వచ్చేసిందోచ్

Drishyam 2 Official Trailer Out
x
దృశ్యం 2
Highlights

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో వచ్చిన సస్పెన్స్ థిల్లర్ చిత్రం ‘దృశ్యం’.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో వచ్చిన సస్పెన్స్ థిల్లర్ చిత్రం 'దృశ్యం'. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా.. సాగుతూ ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టిందా సినిమా. అంతేకాదు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ రిమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా మలయాళంలో 'దృశ్యం2' పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అమెజాన్‌లో ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దృశ్యం'లో క్లోజ్‌ అయిపోయిన కేసును కొత్తగా వచ్చిన పోలీసు అధికారి రీ ఓపెన్‌ చేయడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. మరి ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అందుకు మోహన్‌లాల్‌ ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. ఆశీర్వాద్ సినిమా పతాకంపై ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనా, ఎస్తేర్ అనిల్, అన్సి, కీలక పాత్ర పోషించారు. అనిల్ జాన్సన్ సంగీతం అందించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories