Narappa: నారప్ప నుంచి మణిశర్మ ఔటయ్యాడా?

Narappa: వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమా నుంచి మణి శర్మ బయటకు వెళ్లాడా? అంటే అవుననే పుకార్లు వినిసిస్తున్నాయి.

Venkata Chari
Published on: 18 March 2021 9:34 PM IST
Does Mani Sharma walk out of Narappa?
X

మణిశర్మ (ఫొటో హన్స్ ఇండియా)

Narappa: వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నారప్ప' సినిమా నుంచి మణి శర్మ బయటకు వెళ్లాడా..? అవుననే పుకార్లు వినిసిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి వివాదాల్లోనూ ఆయన కనిపించలేదు. కానీ, తాజా నివేదికల ప్రకారం సంగీత స్వరకర్త.. నారప్ప డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో విభేదాలొచ్చి, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ధనుష్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'అసురన్' చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై చాలా హైప్స్ క్రియోట్ అయ్యాయి. నారప్ప సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల, ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడుతూ, నారప్ప సినిమాకు సంగీతం ఇచ్చే విషయంలో తనకు పెద్దగా స్వేచ్ఛ లేకపోవడంతో నిరాశ చెందానని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మణి శర్మల మ్యూజిక్ కంపోజ్ విషయంలో కొన్ని విభేదాలు వచ్చి ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి కారణమైందని తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదలకాలేదు.

చాలా కాలం తరువాత మణిశర్మ బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో ఫామ్‌లోకి వస్తున్నారు. ఈ సమయంలో సంగీత స్వరకర్త వివాదంలో చిక్కుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Venkata Chari

Venkata Chari

Next Story