Neha Shetty: భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న డిజే టిల్లు బ్యూటీ

Neha Shetty: 2016 లో కన్నడ లో విడుదలైన "ముంగరు మలే 2" సినిమాతో వెండితెరకు పరిచయమైన నేహా శెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 12:51 PM IST
Neha Shetty: భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న డిజే టిల్లు  బ్యూటీ
X

Neha Shetty: 2016 లో కన్నడ లో విడుదలైన "ముంగరు మలే 2" సినిమాతో వెండితెరకు పరిచయమైన నేహా శెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నేహా ఈ మధ్యనే సందీప్ కిషన్ హీరోగా నటించిన "రౌడీ" సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఇక తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన "డిజే టిల్లు" సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేహా శెట్టి ఈ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన రెమ్యునరేషన్ని భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "డిజే టిల్లు" సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలు కూడా నటించిన నేహా శెట్టి దర్శక నిర్మాతల దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువైనా పర్లేదు కానీ ఈ భామ ని ఎంపిక చేసుకోవడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story