Ravi Teja: రవితేజ 'డిస్కోరాజా' సురేష్ మూవీస్ ద్వారా విడుదలవుతాడట!

K V D Varma
Updated on: 16 Oct 2019 12:14 PM IST
Ravi Teja: రవితేజ డిస్కోరాజా సురేష్ మూవీస్ ద్వారా విడుదలవుతాడట!
X

మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా డిస్కోరాజా. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుందని మొదట అనుకున్నారు. కానీ, ఆ అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. రవితేజ సినిమాల్లోనే భారీ బడ్జెట్ ఈసినిమా కి పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కథ పరంగా సినిమాలో చాలా గ్రాఫిక్స్ ఉంటాయట. ఆ వర్క్స్ పూర్తికావడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో సినిమా వచ్చే ఫిబ్రవరి లేదా వేసవి సెలవులకు విడుదల కావచ్చని అనుకుంటున్నారు.

ఇకపోతే, డిస్కోరాజా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ప్రముఖ నిర్మాత సురేష్ మూవీస్ అధినేత సురేష్ బాబు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇటీవల కాలంలో సినిమాల్ని థియాట్రికల్ రూపంలో ఇస్తున్నారు. పంపిణీ హక్కులు ఇచ్చే విధానం దాదాపుగా తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాని సురేష్ బాబుకు పంపిణీ హక్కులు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందట. అదీకాకుండా ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం అడ్వాన్స్ కూడా తీసుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న డిస్కోరాజా సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కు జతగా 'డిస్కోరాజా'లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story