logo

హీరోగా మారనున్న హాట్రిక్ దర్శకుడు

Anil RavipudiAnil Ravipudi
Highlights

ఎలాగైనా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చి దారి తప్పి హీరోగా సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే దర్శకుడిగా మారి సూపర్ హిట్ సినిమాలు తీసి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకునేవారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు.

ఎలాగైనా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చి దారి తప్పి హీరోగా సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే దర్శకుడిగా మారి సూపర్ హిట్ సినిమాలు తీసి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకునేవారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వాడే దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజాదిగ్రేట్' లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ సినిమా 'ఎఫ్ 2' కు కూడా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అనిల్ కు ఎప్పటినుండో హీరోగా అవ్వాలని కోరిక ఉందట. దర్శకుడిగా మారినప్పటికీ, నటన మీద నుండి ఆసక్తి పోని అనిల్ రావిపూడి ఇప్పటికే 'రాజా ది గ్రేట్' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. 'ఎఫ్ 2' సినిమాలో కూడా ఒక చిన్న కామియో అప్పీరన్స్ ఇవ్వనున్నాడట. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి హీరో గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమా నిర్మించనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి హీరో గానే ఛాన్సుల కోసం వెతుకుతాడా లేక పక్క హీరోలను పెట్టి మళ్ళీ దర్శకుడి అవతారం ఎత్తుతాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


లైవ్ టీవి


Share it
Top