Rana Daggubati: హిట్ కోసం ఫేట్ తో ఫైట్ చేస్తున్న తేజ, రానా..

Rana Daggubati: రానా తో తేజ తీయబోయే మూవీ రాక్షస రాజు.

Arun Chilukuri
Updated on: 8 July 2023 9:30 PM IST
Director Teja Reunite With Rana Daggubati
X

Rana Daggubati: హిట్ కోసం ఫేట్ తో ఫైట్ చేస్తున్న తేజ, రానా..

Rana Daggubati: రానా తో తేజ తీయబోయే మూవీ రాక్షస రాజు. రెండు భాగాలుగా రాబోతోంది. నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్ మల్లీ రిపీట్ కాబోతోంది. సర్వం సిద్దమైంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానాకి సోలో హిట్లు లేవు. చేసిన ప్రతీ మూవీ పంచ్ ఇచ్చింది. అలాని తేజకి కూడా హిట్లున్నాయా అంటే అదీ లేదు. తనకి వరుసగా ఫ్లాపులే.. అందుకే పాత కాంబో రిపీట్ కాబోతోంది.

రీసెంట్ గా అహింసా అంటూ తేజ చేసిన ప్రయోగం వికటించింది. అంతకుముందు సీతా అంటూ తీసిన సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. సో తేజకి కూడా అర్జెంట్ గా హిట్ కావాలి. రానాకి కూడా హిట్ మెట్టెక్కె అవకాశం రావాలి.. అందుకే హిట్ కాంబినేషన్ కి కాలం కలిసొచ్చినట్టుంది.

అరణ్య, 1945, విరాట పర్వం ఇవన్నీ ఫ్లాపులే. నటుడిగా రానాకు పేరొచ్చినా, హిట్లు మాత్రం రాలేదు. కాబట్టే, తనని హిట్ మెట్టెక్కించే బాధ్యతని తీసుకున్నాడు తేజ. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు రానాని హిట్ మెట్టెక్కివ్వటమే కాదు, తను కూడా హిట్ మెట్టెక్కాల్సిన అవసరమొచ్చింది. లేదంటే అడ్రస్సే గల్లంతయ్యేలా ఉంది.

నిజానికి నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానాకి భీమ్లానాయక్ లాంటి మూవీతో హిట్ వచ్చింది. కాని ఇందులో రానా హీరో కాదు. ఇది సోలో హీరో మూవీ కానేకాదు.. కాబట్టే సోలోగా దుమ్ముదులిపే ప్రయత్నంలో ఉన్నాడు రానా.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story