Director Teja: పుష్ప ఓ ఫ్లాప్ మూవీ.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్

Director Teja: పుష్ప ఓ ఫ్లాప్ మూవీ.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్

Rama Rao
Updated on: 3 Oct 2022 9:00 AM IST
Director Teja Made Shocking Comments on Allu Arjun Pushpa Movie
X

Director Teja: పుష్ప ఓ ఫ్లాప్ మూవీ.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్

Director Teja: సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న తేజ కరియర్లో బోలెడు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. 2000 లో "చిత్రం" అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన తేజ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత నువ్వు నేను, జయం, నిజం, లక్ష్మీ కళ్యాణం, వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న తేజ ఈ మధ్యనే 2019లో కరోనాకి ముందు "సీత" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "పుష్ప" సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు తేజ."పుష్ప" సినిమా ఫ్లాప్ సినిమా ఫ్లాప్ అయింది అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు తేజ. "పుష్ప సినిమా మొత్తం డబ్బులని వెనక్కి తీసుకురాలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది ఎగ్జిబిటర్లు సినిమా వల్ల నష్టాలను అనుభవించారు.

కేవలం ముంబైలో మాత్రమే సినిమా బాగా ఆడిందని సినిమాని బ్లాక్ బస్టర్ అని అన్నారు. కానీ తెలుగులో చాలావరకు డిస్టర్బ్యూటర్లు నష్టాలలో కూరుకుపోయారు," అని చెప్పుకొచ్చారు తేజ. అంతేకాకుండా మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు మరియు ఫుడ్ ఐటమ్స్ కి పెట్టే భారీ రేట్ల వల్లనే సగం మంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లోకి దూరంగా ఉంటున్నారని అన్నారు. త్వరలో అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న "అహింస" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు తేజ.

Rama Rao

Rama Rao

Next Story