logo
సినిమా

'యాత్ర' పై స్పందించిన 'సై రా' దర్శకుడు

యాత్ర పై స్పందించిన సై రా దర్శకుడు
X
Highlights

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా...

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' సినిమా 8వ తారీఖున విడుదలైంది. ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో జీవించారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. చాలా వరకు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి పెదవి విప్పటం లేదు. రాజకీయ కారణాల వల్లే సెలబ్రిటీలు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ కొందరు విమర్శిస్తుండగా తాజాగా ఒక టాలీవుడ్ దర్శకుడు 'యాత్ర' సినిమా పై స్పందించారు.

ఆయనే సురేందర్రెడ్డి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ తో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి 'యాత్ర' సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు. "ఇప్పుడే 'యాత్ర' చూశాను! అదొక ఎమోషనల్ జర్నీ. చాలా సన్నివేశాలలో నేను ఎమోషనల్ అయ్యాను. మమ్ముట్టిగారి అద్భుతమైన నటన కారణంగానే సినిమాలో రాజన్ననే నిజంగా చూసినట్టే ఉంది. ఒక గౌరవనీయమైన పని చేసినందుకు యాత్ర చిత్ర బృందానికి నా అభినందనలు" అని ట్వీట్ చేశారు.Next Story