బాలీవుడ్ సినిమా కోసం మహేష్ బాబు ను రాజమౌళి పక్కన పెడతారా?

మహేష్ బాబు సినిమాని రాజమౌళి పక్కన పెట్టనున్నారా?

admin1
Published on: 8 Jan 2022 3:05 PM IST
Director SS Rajamouli Next Film Hero Mahesh Babu or Ranbir Kapoor
X

మహేష్ బాబు సినిమాని రాజమౌళి పక్కన పెట్టనున్నారా?

SS Rajamouli-Mahesh Babu: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆర్ఆర్ఆర్" పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయాల్సిన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని తెలిసిన సంగతి. కానీ తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తో సినిమా చేసే కంటే ముందు రాజమౌళి ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఒక మీడియం బడ్జెట్లో ఒక బాలీవుడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా లో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రణబీర్ కపూర్ రాజమౌళి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా ఆ సినిమా గురించి రణబీర్ కపూర్ నటన గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి-రణ్ బీర్ కపూర్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు రాజమౌళి సినిమా తప్ప మరో సినిమాని ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఎదురు చూస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

admin1

admin1

Next Story