ప్రభాస్ సినిమాకి సింగీతం!

ప్రభాస్ సినిమాకి సింగీతం!
x

Singeetam Srinivasa Rao, Prabhas

Highlights

Prabhas, Nag Ashwin Movie : నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' అనే చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు

Prabhas, Nag Ashwin Movie : నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' అనే చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగ్‌ అశ్విన్‌.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడు.. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన అప్డేట్ ను ఇచ్చింది వైజయంతి సంస్థ.. విభిన్నమైన చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నట్లుగా వెల్లడించింది.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. " లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు... అయన మా సినిమాలో భాగం అవుతున్నందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం... సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని కచ్చితంగా నమ్ముతున్నాం" అంటూ సింగీతం స్కెచ్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది.. అటు పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి చిత్రాలను తెరకెక్కించి గొప్ప దర్శకుడిగా పేరును సంపాదించుకున్నారు సింగీతం..

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories