Prabhas With Nivetha Thomas : ప్రభాస్ సరసన నాని హీరోయిన్?

Prabhas With Nivetha Thomas : మహానటి ఫేం నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 16 Aug 2020 1:16 PM IST
Prabhas With Nivetha Thomas :   ప్రభాస్ సరసన నాని హీరోయిన్?
X
prabhas , niveda thamas (File Photo)

Prabhas With Nivetha Thomas : మహానటి ఫేం నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సీ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణేను తీసుకుంది చిత్రబృందం..

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉండడంతో పలువురు హీరోయిన్స్ అనుకున్నారు మేకర్స్.. అయితే ఆ పాత్ర కోసం ప్రముఖ కథానాయిక నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్వన్ నివేదాని కలసి సినిమాలోని ఆమె పాత్రను వివరించారట. దీనికి కూడా నివేదా థామస్ ఒకే చెప్పినట్టుగా సమాచారం.. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం నివేదా .. మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న 'సర్కారు వారి పాట'లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Krishna

Krishna

Next Story