Sekhar kammula Father Died : శేఖర్ కమ్ములకి పితృవియోగం!

sekhar kammula Father Died :ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన తండ్రి కమ్ముల శేషయ్య (89) మృతి చెందారు.

Krishna
Updated on: 1 Aug 2020 12:06 PM IST
Sekhar kammula Father Died : శేఖర్ కమ్ములకి పితృవియోగం!
X

Sekhar kammula Father Died :ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన తండ్రి కమ్ముల శేషయ్య (89) మృతి చెందారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో భాదపడుతూ మృతి చెందారు.. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం తెలియగానే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు శేఖర్ కమ్ములకీ ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

ఇక శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా కొనసాగుతున్నారు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ''లవ్ స్టోరీ'' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది .

Krishna

Krishna

Next Story