'నో' చెప్పడం నేర్చుకోండి.. లేకపోతే కష్టాలు పడతారు : పూరి జగన్నాధ్

నో చెప్పడం నేర్చుకోండి.. లేకపోతే కష్టాలు పడతారు : పూరి జగన్నాధ్
x

Puri Jagannadh 

Highlights

Puri Jagannadh : పూరి జగన్నాధ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది..

Puri Jagannadh : పూరి జగన్నాధ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది.. పూరి అనగానే ఒకటిగా ఫాస్ట్ గా సినిమాలు తీయడం అయితే ఇంకోటి సుత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడడం.. ఇవే పూరిని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా నిలబెట్టాయి.. ఇక ఇది ఇలా ఉంటే పూరి గత కొన్ని రోజులుగా 'పూరీ మ్యూజింగ్స్‌' పేరుతో కొన్ని అంశాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూరి 'నో' (కాదని చెప్పండి) అనే టాపిక్ పైన మాట్లాడారు..

ఇందులో పూరి మాట్లాడుతూ.. " ప్రతి మనిషి 'నో' చెప్పడం నేర్చుకోవాలని, లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు.. అయితే ఆ చెప్పే నో ఎదుటి వ్యక్తిని బాధించకుండా ఉండేలా ప్రాక్టిస్ చేయండి.. నేను అన్నింటికీ 'ఎస్‌' చెప్పడం వల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డాను.. ఎవరైనా మనముందు ఒక ప్రపోజల్‌ పెడితే.. అది వాడి స్వార్థం కోసమే. మనం పెడితే, మన స్వార్థం కోసమే.. అయితే ఇందులో 'నో' చెప్పిన వాడే సక్సెస్‌ అయినట్లు లెక్క. ముందు 'నో' చెప్పండి, లేదా సమయం కావాలని అడగండి. అన్నింటికీ అప్పుడే, అక్కడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించిన తర్వాత కూడా.. నచ్చకపోతే 'నో' చెప్పండి.'నో' అనేది మీకు శక్తిని ఇస్తుంది, అలా చెప్పిన ప్రతిసారీ సంతోషంగా ఫీల్‌ అవుతారు అంటూ పూరి చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా "చాలా సార్లు ఎందుకు ఒప్పుకున్నానా? అని బాధపడుతుంటారు. ప్రతిదానికీ 'ఎస్‌' అని చెప్పుకుంటే పోతే తక్కువైపోతారు.. నో' చెప్పగలిగేవాడే పవర్‌ఫుల్‌. మీరు 'నో' చెప్పగానే అవతలివాడు దాన్ని 'ఎస్‌'లా ఫీల్‌ అయ్యి.. డీల్‌ అయిపోయిందని సంతోషంగా వెళ్లిపోతే.. మీ అంతటి దేశముదురు మరొకరు లేరు. మీ పేరేంటో చెప్పండి. నేనొచ్చి మీ దగ్గర పని చేస్తా అని పూరి చెప్పుకొచ్చారు. పూరి చెప్పిన వర్డ్స్ కి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories