ZombieReddy2: త్వరలో సెట్స్ పైకి 'జాంబిరెడ్డి-2'

Zombie Reddy 2
x

జాంబీ రెడ్డి 

Highlights

ZombieReddy2:జాంబిరెడ్డి' తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

ZombieReddy2: ఇంద్ర, సాంబ వంటి సినిమాతో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించిన తేజా సజ్జ.. హీరోగా తన తొలిచిత్రం హర్రర్ జోనర్ నటించి పెద్ద సహాసమే చేశాడు. ఇటీవల విడుదలై తన మూవీ 'జాంబిరెడ్డి' తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ..కల్కి వంటి చక్కని సినిమాలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది.

దానికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి2'ను ZombieReddy2 రాబోతోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. 'చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు అనే వాదన అబద్ధం. జాంబిరెడ్డిని 500 థియేటర్లలో విడుదల చేశాం. సినిమా రూ.15కోట్లు వసూలు చేసింది. జాంబిరెడ్డిని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తేజకు హీరోగా తొలి సినిమానే మంచి విజయం దక్కింది. థియేటర్‌లో చూడలేనివారికోసం ఓటీటీలో విడుదల చేస్తున్నాం. దీనికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి2'ను త్వరలోనే తెరకెక్కిస్తాం' అని ప్రశాంత్‌వర్మ అన్నారు.

జాంబిరెడ్డి ఈ నెల 26న నుంచి 'ఆహా'లో ప్రసారం కానుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్బంగా జాంబీ రెడ్డి కొనసాగింపు రాబోతుందని వెల్లడించాడు. జాంబిరెడ్డి సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. జాంబీరెడ్డి2 కూడా ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories