Zombie Reddy Trailer : కరోనా వైరస్‌ బ్యాడ్‌ అయితే.. దాని డాడ్‌ ఎవరో చెప్పగలరా

ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ అభిమానులతో పంచుకున్నారు.

Samba Siva Rao
Published on: 2 Jan 2021 8:16 PM IST
Zombie Reddy Trailer : కరోనా వైరస్‌ బ్యాడ్‌ అయితే.. దాని డాడ్‌ ఎవరో చెప్పగలరా
X

తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం జాంబిరెడ్డి. ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లను స్టార్‌ హీరోయిన్ సమంత, నిర్మాత దిల్‌ రాజు ఇటీవలే విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ అభిమానులతో పంచుకున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన 'జాంబి' జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సిినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తేజ సజ్జ ఇంద్ర మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్‌ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె. రాబిన్‌ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. జాంబి రెడ్డి టీమ్‌ పోస్టర్‌ సహా ప్రతీది సెలబ్రిటీల చేతుల మీదుగా విడుదల చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటోంది. పాన్‌ ఇండియా స్టార్ల జాబితాలో చేరిన ప్రభాస్‌తో ట్రైలర్ రిలీజ్ చేయించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. 'కరోనా వైరస్‌ బ్యాడ్‌ అయితే, దాని డాడ్‌ ఎవరో చెప్పగలరా' అంటూ విడుదల చేసిన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్ లో హర్రర్ ఎలిమెంట్స్ పుష‌్కలంగా ఉన్నాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story