'అ!' అనిపించడానికి సిద్దమవుతున్న ప్రశాంత్ వర్మ

'అ!' లాంటి అద్భుతమైన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ చేయని ప్రయత్నం చేసి చూపించడమే కాక ఆ ప్రయోగంలో విజయాన్ని కూడా సాధించాడు ప్రశాంత్ వర్మ.

Ruthvik
Updated on: 7 Jan 2019 3:40 PM IST
అ! అనిపించడానికి సిద్దమవుతున్న ప్రశాంత్ వర్మ
X

'అ!' లాంటి అద్భుతమైన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ చేయని ప్రయత్నం చేసి చూపించడమే కాక ఆ ప్రయోగంలో విజయాన్ని కూడా సాధించాడు ప్రశాంత్ వర్మ. ఒక సున్నితమైన అంశంతో థ్రిల్లర్ కథను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేనట్టుగా, వేరు వేరు కథలను ఒకే కథ కథగా, ప్రతి సన్నివేశాన్ని సరికొత్తగా కథను నడిపించిన విధానం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ అందిస్తున్న హీరో నాని ని నిర్మాతగా కూడా నిలబెట్టాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు అదే సినిమా రీమిక్స్ వెర్షన్ కోసం వీరిద్దరూ మళ్లీ చేతులు కలపనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఇది సినిమా రూపంలో థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై ప్రేక్షకుల ముందుకు రానుంది. "నన్ను మళ్ళీ 'అ!' సినిమా రీమిక్స్ వెర్షన్ అడగడం చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమా రీమిక్స్ త్వరలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై రానుంది" అని ట్వీట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఇక సినిమాలాగానే ఈ రీమిక్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూద్దాం.

Ruthvik

Ruthvik

Next Story