Merlapaka Gandhi: ఇంక రీమేక్ లు చేయను అంటున్న దర్శకుడు

Merlapaka Gandhi:మేర్లపాక గాంధీ రీమేక్ సినిమాలు చేసే ప్రసక్తే లేదని సభదం చేస్తున్నారు

admin1
Updated on: 8 Oct 2021 6:07 PM IST
Director Merlapaka Gandhi Says I will Not Make Remake Movies after Masetro Movie | Telugu Cinema News
X

దర్శకుడు మేర్లపాక గాంధీ (ఫోటో - ది హన్స్ ఇండియా)

Merlapaka Gandhi: చాలా మంది దర్శకులు రీమేక్ సినిమాలు చేయడానికి భయపడతారు. ఎంత బాగా చేసినా సరే ఒరిజినల్ అంత బాలేదు అని సినిమాని తీసి పారేస్తారేమో అని రీమేక్ అంటే ససేమిరా వద్దంటారు. కొందరు మాత్రం సొంత కథలు ఉన్నప్పటికీ రీమేక్ సినిమాలపైనే మొగ్గు చూపిస్తారు. అవకాశాలు బాగా తగ్గిపోయాయి అనుకున్నప్పుడు మాత్రమే రీమేక్ ఆఫర్లు ఓకే చేస్తుంటారు. అయితే తాజాగా ఒక దర్శకుడు రీమేక్ సినిమాలు చేసే ప్రసక్తే లేదని శభదం చేస్తున్నారు.

"వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్", "ఎక్స్‌ప్రెస్ రాజా" చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకున్న యువ దర్శకుడు మేర్లపాక గాంధీ 'కృష్ణార్జున యుద్ధం' తో డిజాస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మేర్లపాక బాలీవుడ్లో సూపర్ హిట్టయిన 'అంధాదున్'ను 'మ్యాస్ట్రో' గా నితిన్ హీరోగా రీమేక్ చేశారు.

ఈ సినిమా ఐడియా తనదే అయినప్పటికీ, ఇకపై మాత్రం రీమేక్ సినిమాలు తీయనని మేర్లపాక చెబుతున్నారు. గత ఏడాది తాను అరకులో ఉండగా ఒక ఫ్రెండ్ 'అంధాదున్' బాగా నచ్చిందని చెప్పడంతో చూశాడట. బాగా నచ్చడంతో రీమేక్ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనుకుని నితిన్‌ను సంప్రదించారట. నితిన్ కూడా ఓకే చెప్పడంతో తన సొంత బ్యానర్లోనే ఈ సినిమా చేశాడు గాంధీ. అయితే తను కేవలం 'అంధాదున్' లైన్ మాత్రమే తీసుకుని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారని స్పష్టం చేశారు. కానీ ఇకపై మాత్రం రీమేక్ సినిమాలు తీయనని గాంధీ చెబుతున్నారు.

admin1

admin1

Next Story