Krithi Shetty - Lingusamy: ఉప్పెన బ్యూటీని మందలించిన స్టార్ డైరెక్టర్

admin1
Published on: 10 Aug 2021 1:50 PM IST
Director Lingusamy Shouts on Krithi Shetty in Ram Pothineni Rapo 19 Movie Shooting
X

కృతి శెట్టి - లింగుసామి (ఫైల్ ఫోటో)

Krithi Shetty: వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన "ఉప్పెన" సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ అందరి మనసుల్నీ దోచుకొని వరుస ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా ఈ భామ ను నటన విషయంలో ఒక దర్శకుడు మందలించినట్లు సమాచారం. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం సినిమాకి కీలకంగా ఉండబోతుందట.

కానీ ఆ సన్నివేశంలో భావోద్వేగాలను పండించటానికి కృతి శెట్టి ఎంత కష్టపడ్డా సరిగ్గా చేయటం లేదని, ఎన్ని టేకులు తీసుకున్నా సీన్ ఓకే కాకపోవడంతో విసుగుచెందిన లింగుస్వామి మూడ్ మార్చడం కోసం ఆమెపై అరిచాడట. ఆ తర్వాత ఎట్టకేలకు కృతి శెట్టి ఆ సీన్లో నటించి లింగుస్వామి మన్ననలు పొందిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా కృతి శెట్టి నాని హీరోగా నటిస్తున్న "శ్యామ్ సింఘా రాయ్", ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", నాగ చైతన్య సరసన "బంగార్రాజు" మరియు నితిన్ హీరోగా వస్తున్న మరో సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story