ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ తో "బంగార్రాజు" డైరెక్టర్

Director Kalyan Krishna: "సోగ్గాడే చిన్నినాయన సినిమా" తో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణ కురసాల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.

admin1
Published on: 18 Jan 2022 6:35 PM IST
Director Kalyan Krishna Next Film Under Studio Green
X

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ తో "బంగార్రాజు" డైరెక్టర్

Director Kalyan Krishna: "సోగ్గాడే చిన్నినాయన సినిమా" తో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణ కురసాల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత "రారండోయ్ వేడుక చూద్దాం" అంటూ నాగచైతన్య హీరోగా మరో మంచి హిట్ ను అందుకున్న కళ్యాణ్ కృష్ణ "నేల టికెట్" సినిమా తో మాత్రం అంతగా మెప్పించలేకపోయారు. ఇక ఈ మధ్యనే నాగార్జున మరియు నాగ చైతన్య ఇద్దరితో కలిసి "బంగార్రాజు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటూ మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.

తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కళ్యాణ్ కృష్ణ తన తదుపరి సినిమాని సైన్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా స్టూడియోగ్రీన్ అనే బ్యానర్ పై చాలా సినిమాలు నిర్మించడం, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. 2006లో "సిలును ఒరు కాదల్ (తెలుగులో, నువ్వు నేను ప్రేమ)" సినిమా తో మొదలైన స్టూడియోగ్రీన్ ప్రయాణం లో ఇప్పటికే పరుత్తివీరన్, సింగం, మద్రాస్, సిరుతై వంటి సూపర్ హిట్ సినిమాలను మనకు అందించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "నోటా" సినిమాను కూడా నిర్మించింది. తాజాగా ఇప్పుడు బంగార్రాజు డైరెక్టర్తో స్టూడియో గ్రీన్ వారు ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

admin1

admin1

Next Story