శ్రీకాంత్ కొడుకుతో దర్శకేంద్రుడి పెళ్లి సందడి?

శ్రీకాంత్ కొడుకుతో దర్శకేంద్రుడి పెళ్లి సందడి?
x
Highlights

Hero Srikanth Son Roshan : శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Hero Srikanth Son Roshan : శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు..

పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...' అని అయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మళ్ళీ కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయిపొయింది. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. ఇక ఇప్పటికే నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతో రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

అటు దాదాపుగా మూడేళ్ళ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అయన సినిమాలను చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories