'హీరో' కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ఇప్పుడు తెలుగులో ఒక హీరోగా త్వరలోనే పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

admin1
Updated on: 14 Jan 2022 12:30 PM IST
Director Anil Ravipudi Surprise Role in Hero Movie
X

‘హీరో’ కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ఇప్పుడు తెలుగులో ఒక హీరోగా త్వరలోనే పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. "హీరో" అనే సినిమాతో నిజంగానే టాలీవుడ్ హీరో గా మారబోతున్న అశోక్ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ చిన్న పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ముందు మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి "సరిలేరు నీకెవ్వరు" సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి అశోక్ మొదటి సినిమాలో కీలకపాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటిదాకా కెమెరా వెనుక తన టాలెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఒక నటుడిగా కూడా ప్రేక్షకులకు కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల కి సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story