Dilip Kumar: శ్వాస సమస్యలతో మరోసారి హాస్పిటల్‌లో చేరిన దిలీప్ కుమార్.

Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ శ్వాస సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరారు.

Kranthi
Published on: 30 Jun 2021 1:18 PM IST
Dilip Kumar Admitted to Hospital Due to Breathlessness
X

Actor Dilip Kumar:(File Image)

Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(98) ముంబైలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేరారు. గత కొద్ది రోజులుగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఆయన్ను నాన్-కోవిడ్ హిందూజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దిలీప్ కుమార్ ని ముందు జాగ్రత్త చర్యగా అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్స్ తెలిపారు.

దిలీప్ కుమార్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసియులో ఉన్నారు. ఇదే సమస్యలతో దిలీప్ కుమార్‌ని ఇటీవల జూన్ 6 న అదే ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.. ఇక కోవిడ్ కారణంగా దిలీప్ కుమార్ గత సంవత్సరం తన ఇద్దరు తమ్ముళ్లను అస్లాం ఖాన్ (88), ఎహ్సాన్ ఖాన్ (90) ను కోల్పోయిన విషయం తెలిసిందే. 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Kranthi

Kranthi

Next Story