మళ్ళీ దిల్ రాజు క్యాంప్ లొనే ఉండబోతోన్న సూపర్ హిట్ దర్శకుడు

Dil Raju
x
Dil Raju
Highlights

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి వరుస విజయాలతో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలను దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి వరుస విజయాలతో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలను దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. పటాస్ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సుప్రీమ్' సినిమాను దిల్ రాజు నిర్మించారు. తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాను కూడా నిర్మించి మంచి ప్రాఫిట్ లను అందుకున్నారు దిల్ రాజు. ఈ మధ్యనే విడుదలైన 'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాను కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.

ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అనిల్ రావిపూడి ని దిల్ రాజు మరొక సినిమా కు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం 'మజిలీ' సినిమాతో బిజీగా ఉన్న నాగచైతన్య తర్వాత 'వెంకీ మామ' సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమాకు ఓకే చేసినట్లు సమాచారం ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే మూడు సూపర్ హిట్ లను అందించిన అనిల్ రావిపూడి నాలుగవ సారి కూడా దిల్ రాజు కి హిట్ ను అందిస్తాడు లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories