Top
logo

Diamirza: తల్లి కాబోతున్న దియా మీర్జా

Dia Mirza Announces Pregnancy as She Flaunts Baby Bump
X

Dia మీర్జా:(ఫైల్ ఇమేజ్) 

Highlights

Diamirza: బాలీవుడ్ భామ దియా మీర్జా తాను త‌ల్లిని కాబోతున్నాన‌ని ఇన్‌స్టా వేదిక‌గా చెప్పింది.

Diamirza: వైల్డ్ డాగ్ మూవీ లో నాగ్ సరసన నటించిన బాలీవుడ్ భామ దియా మీర్జా తాను త‌ల్లిని కాబోతున్నాన‌ని ఇన్‌స్టా వేదిక‌గా చెప్పింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖిని దియా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట‌.. ఓ అంద‌మైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సూర్యాస్త‌మ‌యంలో స‌ముద్రం ఒడ్డున నిల‌బ‌డిన దియా.. త‌న క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌ను చేతుల‌తో అదుముకుంటూ ఉన్న ఫోటోను షేర్ చేసి, తాను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఈ ఫోటోతో పాటు ఓ భావోద్వేగ‌మైన క‌విత‌ను కూడా ఆ న‌టి పోస్టు చేసింది.

ఈ సంద‌ర్భంగా దియాకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబానీ దండేక‌ర్, తాహీరా క‌శ్య‌ప్‌, మ‌హీప్ క‌పూర్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. దియా మీర్జా గ‌తంలో సాహిల్ సంఘా అనే వ్య‌క్తిని పెళ్లాడింది. పెళ్లైన 11 ఏండ్ల త‌ర్వాత అంటే 2019లో సాహిల్ నుంచి దియా విడిపోయారు. ఆ త‌ర్వాత వైభ‌వ్‌ను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న వివాహ‌మాడింది. ఈ పెళ్లి వేడుక‌కు కుటుంబ స‌భ్యుల‌తో పాటు ద‌గ్గ‌రి బంధువులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

Web TitleDia Mirza Announces Pregnancy as She Flaunts Baby Bump
Next Story