చిరంజీవి కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షల గీతం

చిరంజీవి కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షల గీతం
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు అభిమాన ఆరాధ్య సినిమా హీరో. ఒక్క ప్రేక్షకుల వరకే ఆయన అభిమానులు ఉన్నారనుకుంటే పొరపాటే. సినిమా ప్రపంచంలో చిరంజీవి అంటే విపరీతంగా అభిమానించే కథానాయకులకూ, నాయికలకూ, టెక్నీషియన్ లకూ కూడా ఆయన ఆరాధ్యుడే. ఇక సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ కు వీర భక్తుడు. ఆయన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యెక గీతం ఆవిష్కరించారు.

చిరంజీవి అంటే చాలు కుమ్ముడు అంటూ దూసుకు వచ్చేస్తాయి ఆ సంగీత దర్శకుడి నుంచి పాటలు. అయన చేసిన పాటలు అన్నీ ఒక ఎత్తైతే.. మెగాస్టార్ తో చేసిన పాటలు ఒక ఎత్తు. శంకర్ దాదా ఎమ్బీబీఎస్ అన్నా.. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అన్నా.. అది ఆయనకు ఒక్కడికే చెల్లింది. చిరంజీవిని ప్రేమించిన సంగీత దర్శకుడు. ఎవరో గుర్తు పట్టారుకదా.. ఎస్.. దేవీ శ్రీ ప్రసాద్. మెగాస్టార్ మెగా అభిమానుల్లో మొదటి వరుసలో ఉంటారాయన.

మరి అయన ఈరోజు చిరంజీవి పుట్టినరోజు అంటే ఊరకే ఉండరు కదా. తనదైన శైలిలో చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు. తన టీం తో కలిపి ప్రత్యేక గీతాన్ని వినిపించారు. అంతే కాకుండా మీ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సైరా ట్రైలర్ గురించి అయన చెబుతూ అడిరిపోయిన్దన్నారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ అయన చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీకోసం ఇదిగో..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories