Devi Sri Prasad: 'సిర్కస్' ప్రాజెక్ట్ లో దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad: రణవీర్ సింగ్ 'సిర్కస్' ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. ఈ సినిమాను రోహిత్ శెట్టి నిర్మిస్తున్నాడు.

Venkata Chari
Published on: 3 May 2021 4:03 PM IST
Devi Sri Prasad on board for a Bollywood Cirkus Movie
X

దేవీ శ్రీ ప్రసాద్

Devi Sri Prasad: రణవీర్ సింగ్ నటించబోయే 'సిర్కస్' ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. ఈ సినిమాను బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు టాలీవుడ్ రాక్‌స్టార్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ను బోర్డులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారంట.

దేవి శ్రీ ప్రసాద్, సల్మాన్ ఖాన్ కోసం సీటీ మార్ పాటను కంపోజ్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. తాజా సమాచారం ప్రకారం, డీఎస్పీ ఇప్పటికే ఈ చిత్రానికి రెండు పాటలు కంపోజ్ చేశారంట. మొదటిది డాన్స్ నంబర్, మరొకటి రొమాంటిక్ లవ్ సాంగ్. మూవీ యూనిట్ ఇప్పటికే ఒక పాట షూట్ చేశారంట. రెండో పాటను షూట్ చేసేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాటలు కాకుండా, మిగిలిన పాటలకు సంగీతం చేసేందుకు వేరే వారిని తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామిక్ ఎంటర్టైనర్.. షేక్స్పియర్ నాటకం 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story