మహానటి కోసం స్టార్ మ్యూజిషియన్

'మహానటి' సినిమా తో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. కీర్తి కెరీర్ లో అప్పటివరకు...
'మహానటి' సినిమా తో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. కీర్తి కెరీర్ లో అప్పటివరకు చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే, 'మహానటి' సినిమా మరొక ఎత్తు గా మారింది. ఇక ఆ తరువాత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన డబ్బింగ్ చిత్రాలు 'సామి 2', 'పందెంకోడి 2', తెలుగులో పెద్దగా ఆడలేదు. తాజాగా ఈ భామ కు బాలీవుడ్ నుంచి పెద్ద అవకాశం వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో ఒక పెద్ద ప్రాజెక్టుకు సైన్ చేసింది కీర్తి సురేష్. ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ కథ అయినప్పటికీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ లు ఉంటాయని సినిమా మొత్తం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగుతుందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం కోసం టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్ తెలుగులో హీరోయిన్గా నటించిన 'నేను లోకల్' మరియు 'నేను శైలజ' సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. హిందీ లో కీర్తి సురేష్ డెబ్యూ సినిమా గా మారనున్న ఈ చిత్రం హిందీ లో మాత్రమే కాక తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్రవేసుకున్న కీర్తి బాలీవుడ్లో కూడా తన సత్తా చాటనుంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Cyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMT