Devi Sri Prasad: బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad: తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టిన డిఎస్పి

Jyothi
Updated on: 4 Dec 2022 8:30 PM IST
Devi Sri Prasad is Focusing on Bollywood
X

Devi Sri Prasad: బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad: టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు. ఒకవైపు తమన్, గోపి సుందర్ వంటి వారు కెరియర్లో చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతున్నప్పటికీ దేవిశ్రీప్రసాద్ మాత్రం తనదైన శైలిలో ఎప్పటికప్పుడు తన సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ రాక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో దేవిశప్రసాద్ వేగం కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. అవకాశాలు లేకుండా పూర్తిగా కనుమరుగవ్వలేదు కానీ డిఎస్పి వరకు వచ్చే సినిమాల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు.

అయితే ఇదే సమయంలో దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ టీ సిరీస్ నుంచి ఒక మంచి ఆఫర్ రావడంతో వెంటనే దేవిశ్రీప్రసాద్ దీనికి ఒప్పేసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతిలో చిరంజీవి "వాల్తేరు వీరయ్య" వంటి సినిమాలు ఉన్నాయి కానీ ఈ మధ్యనే సినిమా నుంచి విడుదలైన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆఖరికి బాస్ పార్టీ సాంగ్ కూడా అంతంతమాత్రంగానే అనిపించింది. నిజానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ వారు తమ మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తూ ఉండే టి సిరీస్ వారు ఒక్కో సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులని ఎంపిక చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఇప్పుడు టి సిరీస్ నిర్మిస్తున్న "సర్కస్" సినిమాకి కూడా లిజోజార్జ్ మరియు డీజే చేతస్ తో సంగీతం తీసుకుంటున్న టి సిరీస్ వారు దేవి శ్రీ ప్రసాద్ ని కూడా రంగంలోకి దింపారు. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ రెండు పాటలకు సంగీతాన్ని అందించారు. ఈ రెండు పాటలకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో దేవిశ్రీప్రసాద్ చిరంజీవి సినిమా కంటే బాలీవుడ్ సినిమా పైన ఎక్కువగా దృష్టి పెట్టారు అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు దేవిశ్రీప్రసాద్ అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప 2" సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story