"తనకు హెడ్ వెయిట్ ఎక్కువ" అంటున్న కార్తీ

తనకు హెడ్ వెయిట్ ఎక్కువ అంటున్న కార్తీ
x
Highlights

ఎప్పుడో 'స్పైడర్' సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ ఇతర భాషల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తి...

ఎప్పుడో 'స్పైడర్' సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ ఇతర భాషల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తి , రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా 'దేవ్' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీకున విడుదల కానుంది. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ హెడ్ వెయిట్ ఉన్న మోడ్రన్ ఎన్నారై భామగా కనిపించనుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తీ రకుల్ గురించి బోలెడు విషయాలు చెప్పాడు.

'ఖాకీ' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రకుల్ ని వాయిస్ మెసేజ్ లు ఇస్తున్నట్టు చూసాను. తనకి బిజినెస్ ఉమెన్ పాత్ర సరిగ్గా సరిపోతుందనిపించింది. అదే 'దేవ్' దర్శకుడు లక్ష్మణ్ కి చెప్పాను. అలా రకుల్ ఈ సినిమాకి హీరోయిన్ అయింది. దేవ్ కి డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు కానీ మేఘన (రకుల్ పాత్ర పేరు) కు డబ్బు ఇంపార్టెంట్. ఇలాంటి భిన్నమైన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కథే 'దేవ్'. చాలా స్టైలిష్డ్ గా సినిమాని తెరకెక్కించాం." అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కాకుండా రకుల్ చేతిలో 'ఎన్జీకే' సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories