Sushant Singh Rajput: సుశాంత్ తండ్రికి కోర్టులో చుక్కెదురు

Sushant Singh Rajput: బాలీవుడ్ యువకథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్(ధోనీ మూవీ ఫేం) గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Updated on: 11 Jun 2021 12:58 PM IST
Delhi High Court Dismisses Sushant Singh Father Pil
X

సుశాంత్ సింగ్(Thehansindia) 

Sushant Singh Rajput: బాలీవుడ్ యువకథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్(ధోనీ మూవీ ఫేం) గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత ఆయన జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్స్ సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటిపై సుశాంత్ తండ్రి కిషోర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాడు. తన కొడుకు జీవిత చరిత్ర సినిమాను తమ అనుమతి లేకుండా సుశాంత్ జీవితాన్ని వక్రీకరిస్తూ తీసిన సినిమాల విడుదల అడ్డుకోవాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు వేసిన స్టే పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది.

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ జీవితంతో సంబంధం లేకుండా కల్పిత కథలతో తాము సినిమా తీస్తున్నట్లుగా వారు చెప్పడంతో పాటు ఎలాంటి వివాదాస్పద అంశాలను కూడా తాము చూపించబోవడం లేదు అంటూ సదరు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు మరియు దర్శకులు కోర్టుకు తెలియజేయడంతో విడుదల పై స్టే ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. సుశాంత్ కథ కాకుండా మరో కథతో సినిమాలు చేస్తూ కూడా అనధికారికంగా సుశాంత్ బయోపిక్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై సుశాంత్ సింగ్ సోదరి స్పందిస్తూ.. ఈ విషయాన్ని కొందరు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన సుశాంత్ జీవితాన్ని మరింతగా రాద్దాంతం చేయడం భావ్యం కాదని.. సినిమాలను విడుదల చేయవద్దంటూ ఆమె కోరింది. కాని ఆయన అభిమానులు మాత్రం సుశాంత్ బయోపిక్ ను కోరుకుంఉటన్నారు. ఆయన జీవితాన్ని వెండి తెరపై చూడాలని ఆశ పడుతున్నారు. మరి కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story