కరోనా ఎఫెక్ట్.. దొంగగా మారిన సీరియల్ నటి!

Deivamagal Serial Actress : కరోనా ఎఫెక్ట్ ప్రతి ఒక్క రంగం పైన పడింది.. అందులో సినీ రంగం ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం వలన చాలా

Krishna
Published on: 17 Sept 2020 5:25 PM IST
కరోనా ఎఫెక్ట్.. దొంగగా మారిన సీరియల్ నటి!
X

Gold, Money

Deivamagal Serial Actress : కరోనా ఎఫెక్ట్ ప్రతి ఒక్క రంగం పైన పడింది.. అందులో సినీ రంగం ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం వలన చాలా మంది నటులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కొందరు ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడ్డారు.. అయితే తాజాగా ఓ తమిళ సీరియల్ నటి తన అత్తావారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది.. ఇక వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ కుటుంబానికి చెందిన మణికందన్‌ అనే వ్యక్తి సినిమా పైన ఉన్న పిచ్చితో చెన్నై వెళ్ళాడు.. అక్కడ 'దైవమగల్‌' సీరియల్ నటి సుచిత్ర దగ్గర కారు డ్రైవర్ గా చేరాడు..

ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడడం, ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకోవడం చకచక జరిగిపోయాయి.. అయితే కరోనా నేపథ్యంలో షూటింగ్ లు ఆగిపోవడంతో సుచిత్రకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.. దీనితో మణికందన్‌ సుచిత్రను తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు.. అక్కడ వీరి పెళ్లికి మణికందన్‌ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.. అక్కడే కొంత కాలం ఉండాలని వీరు నిర్ణయం తీసుకున్నారు..

అయితే అత్తావారి ఇంట్లో బంగారం,డబ్బు ఉండడం గమనించిన సుచిత్ర వాటిని దొంగతనం చేసి ఓ షార్ట్‌ఫిల్మ్‌ తెరకెక్కించి.. డబ్బు, ఫేమ్‌ సంపాదించాలని ప్లాన్ వేసింది.. ఇది తన భర్తకు చెప్పి ఒప్పించింది.. ఆ తరవాత ఓ సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పి అత్తవారి ఇంటి నుంచి చెన్నైకి వెళ్లిపోయింది సుచిత్ర.. ఆ తరవాత ప్లాన్ లో భాగంగా మణికందన్‌ డబ్బు బంగారం తీసుకొని చెన్నై చేరుకున్నాడు.. అయితే ఇంట్లో బంగారం డబ్బు కనిపించకపోవడంతో మణికందన్‌ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

అనంతరం కేసును దర్యాప్తు చేయగా కోడలే అసలు సూత్రధారి అని కనిపెట్టారు పోలీసులు.. మణికందన్‌ను అరెస్ట్‌ చేసిన పోలసులు సుచిత్ర కోసం గాలింపులు మొదలు పెట్టారు.

Krishna

Krishna

Next Story