హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..

Deepika Padukone: దీపికాకు ఆరోగ్యం బానే ఉందన్న ప్రాజెక్ట్ కె చిత్ర యూనిట్..

Rama Rao
Updated on: 14 Jun 2022 8:25 PM IST
Deepika Padukone Rushed to a Hospital in Hyderabad After Increased Heart Rate
X

హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..

Deepika Padukone: మంగళవారం(జూన్ 14) నాడు మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి దీపికా హార్ట్ బీట్ పెరిగిపోయిందట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ మంగళవారం నాడు హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో చేరారు. ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ కి వచ్చారు. మంగళవారం(జూన్ 14) నాడు మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి దీపికా హార్ట్ బీట్ పెరిగిపోయిందట. దీంతో వెంటనే ఆమె షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని కామినేని హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె తాను బస చేస్తోన్న నోవెటల్ హోటల్ కి వెళ్లిపోయారు. నోవాటెల్ లో కూడా ఆమె డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ సూచించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల పారిస్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో హుషారుగా పాల్గొంది దీపికా. ఈసారి ఆమెకి జ్యూరీలో మెంబర్ గా ఛాన్స్ దక్కింది. కేన్స్ లో ఉన్న అన్ని రోజులు తన కాస్ట్యూమ్స్ తో అదరగొట్టింది దీపికా. ఈ ఫెస్టివల్ పూర్తయిన తరువాత ఆమె ముంబైలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని హైదరాబాద్ కి పయనమైంది. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K' షూటింగ్ లో పాల్గొంది దీపికా. చిత్రీకరణ సమయంలో ఆమెకి హార్ట్ బీట్ పెరిగిపోవడంతో సెట్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story