Deepika Padukone: బిగ్ బీ, దీపికా కాంబోలో మరో సినిమా?

Deepika Padukone: అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొణె కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్

Kranthi
Updated on: 20 March 2021 12:21 PM IST
Deepika Padukone and Amitabh Bachchan to Share Big Screen Again
X

Deepika Padukone and Amitabh Bachan (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Deepika Padukone: సొట్టబుగ్గల సుందరి, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ వీరి కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టినట్టుగా సినీ వర్గాల్లో టాక్.'పీకూ' చిత్రంతో ఆకట్టుకున్న ఈ ఇద్దరూ మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం 'ది ఇంటెర్న్‌'ను హిందీలో రీమేక్‌ చేయడానికి ఇంతకుముందే నిర్మాత సునిర్‌ కేటర్‌పాల్, వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. ఇందులో దీపికా పదుకొణె, రిషి కపూర్‌లను ప్రధాన పాత్రధారులుగా తీసుకున్నారు. మాతృకలో అన్నే హాత్‌వే పోషించిన పాత్రను దీపిక, రాబర్ట్‌ డీ నీరో పాత్రను రిషి కపూర్‌ పోషించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలోనే రిషి కపూర్‌ మరణించడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇప్పుడు రిషి కపూర్‌ బదులుగా ఆ పాత్రను అమితాబ్‌బచ్చన్‌ చేయబోతున్నారట. ''రిషికి బదులుగా అమితాబ్‌ నటించనున్నారు. సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది, మిగిలిన నటీనటులు ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు''అని వార్నర్‌ బ్రదర్స్‌ వర్గాల చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి కాంబో కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story